: కొన్ని ఛానళ్లు ఆప్ కు సాయం చేస్తున్నాయి: అమిత్ షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించేందుకు సహకరిస్తున్న ఓ హిందీ టీవీ ఛానల్ ప్రసారం చేస్తున్న వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. "ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ గెలుపొందడమే ఆ టీవీ ఛానల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్లో జర్నలిజానికి దీనికంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది?" అని షా పాట్నాలో మీడియా సమావేశంలో ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లోకి మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని ఎందుకు తీసుకువచ్చారన్న ఓ ఛానల్ విలేకరి ప్రశ్నకు సమాధానంగా షా పైవిధంగా మాట్లాడారు. అయితే ఏ ఛానల్ చూడాలో మీరెలా నిర్ణయిస్తారంటూ షాపై కొన్ని టీవీ ఛానళ్ల మీడియా ప్రతినిధులు ఆగ్రహం వక్తం చేశారు. అందుకు స్పందించిన ఆయన, తన నిర్ణయం చెప్పానని, చూడాలా? వద్దా? అనేది ప్రజల నిర్ణయమని అన్నారు.