: చంద్రబాబు పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకుంటే సమాధానం ఇస్తాం: ఎర్రబెల్లి


పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ హెచ్చరించడంపై టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణవాదులు అడ్డుకుంటే ఘాటు సమాధానం ఇస్తామన్నారు. టీఆర్ఎస్ వాళ్లు అడ్డుకుంటామంటే తరిమి కొడతామని హెచ్చరించారు. నారా లోకేష్ కూడా త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకోవడం కేసీఆర్ కు సిగ్గుచేటన్నారు.

  • Loading...

More Telugu News