: దేశాభివృద్ధి కోసమే విదేశీ పెట్టుబడులకు అనుమతి: కేంద్ర మంత్రి వెంకయ్య


దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఛాంబర్ ఆప్ కామర్స్ సదస్సును ఉద్దేశించి కొద్దిసేపటి క్రితం ఆయన ప్రసంగించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణల బాట పట్టక తప్పదన్న ఆయన, వాజ్ పేయి ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశానికి ఆర్థిక పరంగా జవసత్వాలను ఇచ్చాయన్నారు. మేక్ ఇన్ ఇండియాతో భారత్ పారిశ్రామిక వృద్ధి పరుగులు పెట్టనుందన్నారు. దేశంలోకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News