: ఢిల్లీలో సమర్థమంతమైన, ఆదర్శప్రాయమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలం: కిరణ్ బేడీ
దేశ రాజధాని ఢిల్లీకి శక్తిమంతమైన పరిపాలన అవసరమని బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ పునరుద్ఘాటించారు. ప్రజలకు సేవ చేసేందుకు తన 40 ఏళ్ల అనుభవాన్ని అంకితం చేసేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో "నా నలభై ఏళ్ల కార్యనిర్వహణ, ప్రజా సేవ అనుభవంతో ముఖ్యమంత్రిగా ఢిల్లీకి సేవ చేస్తాను. ఢిల్లీకి బలమైన ప్రభుత్వం అవసరం. ఓ దీర్ఘకాల ఢిల్లీ నివాసిగా నగరానికి మనం రుణపడి ఉన్నామని గట్టిగా నమ్ముతున్నా. తప్పకుండా సమర్థమంతమైన, మంచి ప్రభుత్వాన్ని మా జట్టు (బీజేపీ) ఇవ్వగలదు" అని బేడీ పేర్కొన్నారు.