: వైద్య విద్య ఇక్కడ... వైద్య సేవలు మాత్రం అక్కడా? : ఎన్నారై వైద్యులకు వెంకయ్య ప్రశ్న


దేశంలో వైద్య విద్యనభ్యసించి విదేశాలకు వెళుతున్న భారతీయులకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైద్య విద్యను నేర్చుకుని విదేశాల్లో వైద్య సేవలందించేందుకు వెళ్లడం ఏమీ బాగోలేదని ఆయన అన్నారు. గుంటూరులోని ఎన్నారై వైద్య కళాశాల 12 వ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా కొద్దిసేపటి క్రితం వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయ వైద్యులు జన్మభూమిని గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లో సేవలను విరమించుకోవాలని సూచించిన వెంకయ్య, గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచేయాల్సిన గురుతర బాధ్యతలను వైద్యులు గుర్తించాలని కోరారు.

  • Loading...

More Telugu News