: సాయంత్రం దాకా మీ సెల్ ఫోన్లు మోగవు... కస్టమర్లకు ఎయిర్ టెల్ సిబ్బంది నిర్లక్ష్య సమాధానాలు


హైదరాబాదులో నేటి ఉదయం 6 గంటల నుంచి నిలిచిపోయిన ఎయిర్ టెల్ సేవలు ఇంకా పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురవుతున్న వినియోగదారులు ఎయిర్ టెల్ కేంద్రాలను సంప్రదిస్తున్నారు. దీంతో నగరంలోని ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ సెంటర్లు వినియోగదారుల ఫిర్యాదులతో కిటకిటలాడుతున్నాయి. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సదరు కస్టమర్ కేర్ సెంటర్ల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది సిబ్బంది వినియోగదారులకు నిర్లక్ష్యంగా సమాధానాలిస్తున్నట్లు తెలుస్తోంది. 'సాయంత్రం దాకా మీ ఫోన్లు మోగవు' అంటూ దురుసుగా చెబుతున్న సిబ్బంది పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ సెంటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News