: ఒబామా భారత పర్యటనపై నిరసనల వెల్లువ... హైదరాబాదులో సీపీఐ నారాయణ అరెస్ట్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లో జరపనునన్న పర్యటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఒడిశాలో మావోలు ధ్వంసరచనకు దిగగా, తాజాగా వామపక్షాలు కొద్దసేపటి క్రితం నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాయి. ఒబామా పర్యటనను నిరసిస్తూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ నేతృత్వంలో పది వామపక్ష పార్టీల కార్యకర్తలు హైదరాబాదులోని అమెరికా కాన్సులేట్ ను ముట్టడించే యత్నం చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, నారాయణ సహా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, వారిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News