: కర్నూలు జిల్లాలో లారీ- ఆటో ఢీ... ముగ్గురి మృతి


కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లాలోని నంద్యాల సమీపంలో కొద్దిసేపటి క్రితం ఓ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురు వ్యక్తులను స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News