: ‘మెస్సు’లపై కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత... 27 మంది విద్యార్థులపై కేసులు


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా, ఆ రాష్ట్రంలోని విద్యార్థులపై కేసుల నమోదు ఆగలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ మెస్సులేంటన్న విద్యార్థుల గోడు పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన విద్యార్థులు వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనంపై రాళ్ల దాడికి దిగారు. భవనం అద్దాలతో పాటు వర్సిటీ అధికారులకు చెందిన కార్ల అద్దాలను కూడా పగులగొట్టారు. వర్సిటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 27 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, వర్సిటీలో నిన్న నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో నేటి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. అంతేకాక మెస్సులను కూడా మూసేసిన అధికారులు, విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News