: ఒబామా పర్యటనకు నిరసనగా మావోల దుశ్చర్య... రైల్వే ట్రాక్ పేల్చివేత
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒడిశాలోని రాయగఢ్ పరిధికి చెందిన మునగడ వద్ద రెండు రైల్వే ట్రాక్ లను పేల్చేశారు. నేటి తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నేపథ్యంలో రాయపూర్ - సంబల్ పూర్ ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాక ఏపీ వైపు వచ్చే రైళ్ల రాకపోకలపైనా తీవ్ర ప్రభావం పడింది. విశాఖ వైపు వచ్చే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ దుశ్చర్యలో 60 మంది దాకా మావోయిస్టులు పాలుపంచుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో రైల్వే గ్యాంగ్ మన్ ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.