: వెంకటాపురంలో పరిటాల రవి పదో వర్ధంతి... సిక్కోలు ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాళి
టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి పదో వర్ధంతిని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఆయనకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిటాల రవి సతీమణి, ఏపీ మంత్రి పరిటాల సునీతతో పాటు ఆమె కుమారుడు శ్రీరామ్, అనంత జడ్పీ చైర్మన్ చమన్, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాకుళం ఎంపీ, దివంగత ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రవికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన పరిటాల కుటుంబ సభ్యులు, అభిమానులతో భేటీ అయ్యారు.