: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు
గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు స్పాట్ మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.250 పెరిగిన 10 గ్రాముల పసిడి రూ. 26,600 చేరింది. ముంబైలో రూ.26,060, చెన్నైలో 26,085, కోల్ కతాలో రూ.26,700, హైదరాబాద్ లో రూ. 25.900 పలికింది. కాగా, ఈరోజు వెండి ధరలు మాత్రం మరింత తగ్గాయి. కిలో వెండి ధర ఢిల్లీలో రూ.300 తగ్గి రూ. 45,400 చేరింది. ముంబైలో రూ. 46,035, చెన్నైలో రూ.45,105, కోల్ కతాలో రూ. 46,100, హైదరాబాద్ లో రూ.45,000 పలుకుతోంది.