: జర్నలిస్ట్ నళిని సింగ్ ను ప్రశ్నించిన పోలీసులు


కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సతీమణి సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సీనియర్ జర్నలిస్ట్ నళిని సింగ్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. శశిథరూర్ వివాహేతర సంబంధాల వల్లే సునంద మరణించారని నళిని సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, సుమారు 80 నిమిషాల పాటు పోలీసులు ప్రశ్నించారని నళిని సింగ్ తెలిపారు. సునంద పుష్కర్ హత్య కేసు విషయంలో ఢిల్లీ పోలీసులను కలవడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు. సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో జరిగిన సంభాషణలపై పోలీసులు ఆరా తీశారని ఆమె వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ పూణేలో వాటాలకు) సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు సంధించారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News