: భారత్ లో అడుగిడిన ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ 'గాల్వని'
ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ 'గాల్వని' భారత్ లో ప్రవేశించింది. దేశంలో శుక్రవారం ఈ ఇటాలియన్ బ్రాండ్ ను లాంచ్ చేశారు. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ అమ్మకాలు ఆన్ లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. 'ఫ్యాషన్ అండ్ యు' అనే వెబ్ సైట్ ద్వారా 'గాల్వని' దుస్తులు భారత్ లో అందుబాటులో ఉంటాయి. షర్టులు, స్వెటర్లు, పోలో టి-షర్టులు, స్వెట్ షర్టులు విక్రయించనున్నట్టు వెబ్ సైట్ వర్గాలు తెలిపాయి. స్పోర్టింగ్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడేవారికి తమ దుస్తులు నప్పుతాయని పేర్కొన్నాయి. మున్ముందు మరిన్ని గ్లోబల్ బ్రాండ్లను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని వెబ్ సైట్ జీఎం (సోర్సింగ్) ఉత్సవ్ మల్హోత్రా తెలిపారు.