: ఇంటర్నెట్ అంటేనే భయపడే ప్రమాదముంది: గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్


ఇంటర్ నెట్ అంటే భయపడే రోజులు రానున్నాయని గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిట్ హెచ్చరించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే మనం ఎన్నో ఐపీ అడ్రస్ లు, ఇతర పరికరాలు, సెన్సర్లు వినియోగిస్తున్నామన్నారు. మనకు తెలియకుండానే మన ప్రైవసీ సమాచారం మొత్తం ఇంటర్ నెట్ లో పెడుతున్నామని, ఆ సమాచారాన్ని ఇతరులు తస్కరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగే రోజున ఇంటర్ నెట్ అంటేనే భయపడే రోజు వస్తుందని ఆయన వివరించారు. సైబర్ ప్రపంచంలో నిఘా ఎక్కువ కావడంతో రానున్న రోజుల్లో ఇంటర్ నెట్ వినియోగం బాగా తగ్గిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇంటర్ నెట్ అదృశ్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News