: టాలీవుడ్ వరుస విషాదాలపై మంత్రి తలసాని ఆవేదన


టాలీవుడ్ లో ప్రముఖులు మృతి చెందడంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్ నారాయణ భౌతిక కాయానికి ఫిల్మ్ చాంబర్లో పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా, తెలుగు వారందరికీ ఎమ్మెస్ నారాయణ మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఓ మంచి నటుడు మన మధ్య లేకుండా పోయారని తలసాని అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఎమ్మెస్ నారాయణ ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News