: చంద్రబాబును చూసి బిల్ గేట్స్ ఎమోషనల్ అయ్యారట!
స్విట్జర్లాండులోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుండడంతో ప్రపంచ ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలందరూ విచ్చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారు. సదస్సులో చంద్రబాబును చూసి గేట్స్ ఉద్వేగభరితుడయ్యారట. బాబుతో కరచాలనం చేసి, పదేళ్ల తర్వాత కలిశామంటూ ఆప్యాయత ప్రదర్శించారట. అంతేగాదు, తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసి ఎంతో సంతోషించానని కూడా బాబుతో చెప్పారు. ఏపీ సీఎంను ఆయన విందుకు ఆహ్వానించడం విశేషం.