: సౌదీ రాజు మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా (91) న్యుమోనియాతో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్, సౌదీ అరేబియాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలకు అబ్దుల్లా అందించిన సహకారం అమోఘమని ప్రణబ్ కొనియాడారు. భారత్ తో అబ్దుల్లాకు మంచి సంబంధాలున్నాయని అన్నారు. సౌదీ ప్రజలు మంచి నేతను కోల్పోయారని తెలిపారు. మరోవైపు, అబ్దుల్లా మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు.