: ఒబామా కోసం రోడ్లను కడిగేస్తున్నారు


రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?... అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో ఆగ్రాను అద్దంలా తయారు చేస్తున్నారు. చోటా మోటా నాయకుడు సందర్శనకు వస్తేనే రోడ్లను తుడిచి బ్లీచ్ జల్లే రాజకీయనేతలు, అగ్రదేశాధ్యక్షుడికి దుమ్ముధూళిలేని ఆగ్రాను చూపించాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రాలో 600 మంది దినసరి కూలీలతో ఒబామా తిరిగే రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. బ్రష్, సర్ఫ్ నీరుతో శుభ్రం చేస్తున్నారు. అలాగే ఒబామా పర్యటన రోజు వరకు ఆవులు, గేదెలు, వీధి కుక్కలు కనపడకూడదని ఆదేశాలు జారీ చేశారు. తాజ్ మహల్ ను ఆనుకుని ఉండే యమునా నదిలో పేరుకుపోయిన రెండు టన్నుల చెత్తను రెండు రోజుల్లో తీయించేశారు. తాజ్ లోపలి భాగాలు, లాన్ ను మహిళలు శుభ్రం చేస్తుండగా, బయట పురుషులు పని చేస్తున్నారు. తాజ్ చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వారు ఆ రోజు బయటకు రాకూడదు, డాబా మీదికు కూడా వెళ్లకూడదు, బాత్రూం పేరిట బయట తిరగకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా రోడ్లు గుంతలు పడి ప్రమాదాలు జరిగినా స్పందించని అధికారులు, కేంద్రం అత్యంత శ్రద్ధ చూపడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News