: భారత్ పర్యటనకు బయల్దేరిన బరాక్ ఒబామా
భారత్ పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక విమానంలో బయల్దేరారు. 'ఎయిర్ ఫోర్స్ వన్'గా పిలుచుకునే భారీ విమానంలో ఆయన వాషింగ్టన్ నుంచి బయల్దేరారు. జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడి రాక సందర్భంగా ఢిల్లీలో ఏడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాగా, రిపబ్లిక్ డే వేడుకలు జరిగే వేదిక వద్దకు ఒబామా తన అధికారిక 'బీస్ట్' వాహనంలో రానున్నారు.