: నేతాజీకి ఘన నివాళి అర్పించిన మోదీ
బ్రిటీష్ వారి ఉక్కు సంకెళ్ల నుంచి భరతమాతను విముక్తి చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి నేడు. ఈ సందర్భంగా నేతాజీకి ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళి అర్పించారు. నేతాజీ ధైర్య సాహసాలు, దేశ భక్తి మనందరిలో స్ఫూర్తిని నింపుతుందని ట్విట్టర్లో తెలిపారు. సుభాష్ చంద్రబోస్ మన భారతీయుడు అని చెప్పడానికి తానెంతో గర్విస్తానని అన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలు చాలా గొప్పవని కొనియాడారు.