: బిల్ గేట్స్ తో భేటీ అయిన చంద్రబాబు... బాబును విందుకు ఆహ్వానించిన గేట్స్


మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు భేటీ అయ్యారు. దావోస్ లో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని బిల్ గేట్స్ ను చంద్రబాబు కోరారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని, అదే విధంగా రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విన్నపానికి బిల్ గేట్స్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు, మరోసారి అధికారంలోకి వచ్చారని తెలిసి సంతోషించానని చంద్రబాబుతో బిల్స్ గేట్స్ అన్నారు. ఈ రాత్రి విందుకు చంద్రబాబును ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News