: వేయి ఎకరాల్లో ఫార్మా సిటీ... కంపెనీలకు పూర్తి రాయితీలు: కేటీఆర్
దేశవ్యాప్తంగా 33 శాతం ఫార్మా ఎగుమతులు తెలంగాణ నుంచే జరుగుతున్నాయని టీఎస్ మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో ఫార్మా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నగర శివార్లలోని ముచ్చర్లలో వేయి ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయనున్నామని... అందులో ఫార్మా కంపెనీలకు పూర్తి రాయితీలు ఇస్తామని, 30 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ రోజు మాదాపూర్ లోని హైటెక్స్ లో అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పై వివరాలను వెల్లడించారు.