: సీఎంతో వాదించిన ఐఏఎస్ అధికారికి నోటీసులు


జార్ఖండ్ లో ఓ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యాడు. సీఎం రఘుబర్ దాస్ తో వాదించాడంటూ ఐఏఎస్ అధికారి సజ్జల్ చక్రవర్తికి షోకాజ్ నోటీసులు పంపారు. ఈ నెల 20న జరిగిన ఓ సమావేశంలో చక్రవర్తి ముఖ్యమంత్రితో వాదించాడు. ఈ నేపథ్యంలో, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు పంపారు. మూడు రోజుల్లో బదులివ్వాలని పేర్కొన్నారు. చక్రవర్తిని చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో రాజీవ్ గౌబాను సీఎస్ గా నియమించారు. గౌబా ఇప్పటివరకు కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News