: తెలంగాణ సర్కారు అవినీతిని ఎండగట్టండి: జన్మదిన వేడుకల్లో లోకేశ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య లోకేశ్ తన 32వ బర్త్ డే కేక్ ను కట్ చేశారు. లోకేశ్ 32వ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు 32 కేజీల కేక్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు అవినీతిని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధిక మంది క్రియాశీల సభ్యులున్న పార్టీగా టీడీపీని పేర్కొన్న ఆయన, టీడీపీకి ఉన్నంత బలం దేశంలో ఏ పార్టీకి లేదని ప్రకటించారు. టీడీపీని ఏ పార్టీ కూడా ఏమీ చేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు.