: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల పరిస్థితిపై తెలంగాణ సీఎస్ సమీక్ష
తెలంగాణ సచివాలయంలో స్వైన్ ఫ్లూపై టీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ముఖ్య అధికారులు, ప్రత్యేకాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోని రోగుల పరిస్థితిపై సమీక్షించారు. రోగులకు అందుతున్న సేవల వివరాలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ అందిస్తున్న తీరుపై సమీక్ష జరిపారు. స్వైన్ ఫ్లూ బాధితులకు వైద్యం అందించే క్రమంలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని ఈ సందర్భంగా అధికారులకు సీఎస్ సూచించారు.