: దావోస్ లో బిజీబిజీగా చంద్రబాబు... మలేసియా ప్రధానితో భేటీ


ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సు కోసం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం దావోస్ లో అడుగిడిన చంద్రబాబు మొన్న, నిన్న పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం ఆయన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా చంద్రబాబు, రజాక్ ను కోరినట్లు సమాచారం. నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న మలేసియా అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News