: నాగార్జున సాగర్ లో తీవ్ర ఉద్రిక్తత... ఇరువైపులా మోహరించిన తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులు
గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దులోని నాగార్జున సాగర్ ఆనకట్ట వద్ద నేటి ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్యామ్ గేట్ల నిర్వహణ మాదంటే మాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. డ్యామ్ గేట్ల నిర్వహణలో తమకూ అధికారం ఇవ్వాలని ఏపీ అధికారులు పట్టుబట్టగా, అది విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో డ్యామ్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సాగర్ కుడి కాలువకు నీటి విషయంలో ప్రతి రోజూ ఏదో ఒక వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను అక్కడ బందోబస్తుకు ఏర్పాటు చేశారు.