: రిపబ్లిక్ డే రోజున భారత్ బంద్... పిలుపునిచ్చిన మావోయిస్టులు


మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రిపబ్లిక్ డే (ఈనెల 26న) నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ లేఖ ద్వారా బంద్ ప్రకటనను వెల్లడించారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా రావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. మోదీ పరిపాలన కాషాయీకరణ వైపు సాగుతోందని... పాలనలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కువైందని విమర్శించారు. దేశాన్ని మోదీ అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు. రిపబ్లిక్ డే రోజున ప్రధాని మోదీ, ఒబామాల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News