: బీహార్ లోని సివిల్ కోర్టులో బాంబు పేలుడు... ఇద్దరు మృతి


బీహార్ లో కొద్దిసేపటి క్రితం బాంబు పేలుడు సంభవించింది. బీహార్ పట్టణం ఆరా లోని సివిల్ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. శక్తిమంతమైన ఈ పేలుడు కారణంగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు జరగడంతో పట్టణంలో కలకలం రేగింది. పేలుడు నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కోర్టు ప్రాంగణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News