: మంచి నటుడిని కోల్పోయాం: ఎంఎస్ నారాయణ మృతికి కేసీఆర్ సంతాపం
టాలీవుడ్ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంఎస్ నారాయణ మరణంతో తెలుగు చిత్రసీమే కాక తెలుగు ప్రేక్షకులు కూడా ఓ మంచి నటుడిని కోల్పోయినట్లైందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ నారాయణ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ఆ ప్రకటనలో తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఎంఎస్ నారాయణ నేటి ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.