: ఎమ్మెస్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన నటుడు, రచయిత ఎమ్మెస్ నారాయణ మృతికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, సీహెచ్ అయ్యన్నపాత్రుడు కూడా ఎమ్మెస్ మృతికి సంతాపం ప్రకటించారు. తెలుగు చిత్రసీమలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎమ్మెస్ మరణంతో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆయనతో ఎన్నో సినిమాలు చేసిన చిరంజీవి కూడా సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే.