: పేరడీ కింగ్... ఎంఎస్ నారాయణ!


టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అతి తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా తెలుగు సినిమాల్లో పేరడీలతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఏ సినీ హీరో పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఎంఎస్, తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 'దూకుడు' సినిమాలో పలువురు అగ్రహీరోల పేరడీలతో రూపొందించిన సీన్ ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఆ సీన్ లో ఎంఎస్ విభిన్న రీతుల్లో కనిపించి, సదరు పాత్రల రియల్ హీరోలను మరిపించడమే కాక, హాస్యాన్ని పండించారు. తెలుగు చిత్రసీమలోని దాదాపుగా హీరోలందరి పేరడీల్లోనూ ఎంఎస్ కనువిందు చేశారు. అంతేకాక పలు బాలీవుడ్ హీరోలతో పాటు రాజకీయవేత్తల రూపాల్లోనూ ఆయన ఆకట్టుకున్నారు. ఢిల్లీ రాజకీయ సంచలనం అరవింద్ కేజ్రీవాల్ రూపంలో కనిపించిన ఎంఎస్, ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఇక మందుబాబు పాత్ర ఎంఎస్ కు బ్రాండ్ ఇమేజ్ గా మారింది. పలు చిత్రాల్లో మద్యం మత్తులో జోగుతూ ఆయ చేసిన నట కౌశలం అజరామరం.

  • Loading...

More Telugu News