: మూడేళ్లలో 2500 నగరాలు, పట్టణాల్లో వై-ఫై సేవలు


దేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. వచ్చే మూడేళ్లలో దేశంలోని 2500 నగరాలు, పట్టణాల్లో హై స్పీడ్ వై-ఫై సేవలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అందుకోసం బీఎస్ఎన్ఎల్ ద్వారా రూ.7000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ వై-ఫై పథకంలో కొంత సమయం మాత్రమే ఉచితంగా సేవలు వినియోగించుకోవచ్చు. పరిమితి ముగిసిన అనంతరం సేవలకు నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచి, తద్వారా 'డిజిటల్ ఇండియా'ను రూపొందించాలని మోదీ సర్కారు భావిస్తోంది. అందులో భాగంగానే ఈ వై-ఫై సేవల విస్తరణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ వై-ఫై పథకంలో '4జీ' సేవలందిస్తామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీవాస్తవ తెలిపారు.

  • Loading...

More Telugu News