: విశాఖ 2కే రన్ లో వెంకయ్య ఉత్సాహం... యువకులతో కలిసి పరుగు!


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేటి ఉదయం విశాఖలో తన ‘ఉత్సాహం’ చూపారు. విశాఖ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నగరంలో జరిగిన 2కే రన్ లో రన్నింగ్ చేశారు. తెల్లటి పంచెకట్టులో వచ్చిన వెంకయ్యనాయుడు, 2కే రన్ లో భాగంగా యువకులతో కలిసి కొద్దిదూరం రన్నింగ్ చేశారు. యువకులతో పోటీ పడ్డట్లు ఆయన చేసిన రన్నింగ్ అక్కడి యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక మీడియీ కెమెరాలు ఆయనతో పాటే పరుగులు పెట్టి మరీ, ‘రన్నింగ్ వెంకయ్య’ను తమలో నిక్షిప్తం చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News