: 23 రోజుల్లో ఇది నాలుగో మరణం... పరిశ్రమకు ఏదో పట్టుకుంది: మురళీమోహన్
ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ మృతి పట్ల సినీ నటుడు, నిర్మాత టీడీపీ ఎంపీ మురళీమోహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిన్న ఆయన మృతిపై వదంతులు రాగానే, వెంటనే ఎమ్మెస్ కుటుంబసభ్యులతో మాట్లాడానని... అలాగే కిమ్స్ వైద్యులకు ఫోన్ కూడా చేశానని... ఎమ్మెస్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరానని తెలిపారు. మొదటిసారి కథ చెప్పడం కోసం ఎమ్మెస్ తన వద్దకు వచ్చారని... అయితే, అనుకోకుండా ఈవీవీ సత్యనారాయణ ద్వారా నటుడిగా మారారని గుర్తు చేసుకున్నారు. సినీరంగ ప్రముఖులు వరుసగా దూరమయిపోతుండటంపై మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 23 రోజుల్లో ఇది నాలుగో చావని... తెలుగు సినీ పరిశ్రమకు ఏదో పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటున్నానని చెప్పారు.