: కామెడీతో కిక్కెక్కించిన ఎమ్మెస్ వాస్తవానికి ఓ లెక్చరర్
ప్రముఖ్య హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో మృతి చెందడం సినీ అభిమానులను, సినీ రంగానికి చెందిన వారిని విషాదంలో ముంచివేసింది. 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఎమ్మెస్ వృత్తి రీత్యా ఓ లెక్చరర్. ఆయన అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ. సినిమాలపై మక్కువతో ఆయన నటుడిగా మారారు. లింగబాబు లవ్ స్టోరీతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఎమ్మెస్, ఐదు సార్లు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులు, రెండు సినీ గోయర్స్ అవార్డులు సొంతం చేసుకున్నారు.