: అద్వానీ, రజనీకాంత్ లకు 'పద్మ' పురస్కారం!


దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పద్మ పురస్కారాలను రిపబ్లిక్ డే నాడు ఇవ్వనున్నారు. అవార్డులకు ఎంపికైన వారితో కేంద్రం ఓ జాబితా రూపొందించింది. బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీకి పద్మవిభూషణ్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక, ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా 'పద్మ' పురస్కారాల జాబితాలో ఉన్నట్టు తెలిసింది. వీరే కాకుండా, బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్, ప్రఖ్యాత దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్, యాడ్ ఫిలిం మేకర్ ప్రసూన్ జోషి కూడా ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైనట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News