: ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డు... ఒక్క రోజులో రూ. 32 కోట్ల ఆదాయం
గడచిన సంక్రాంతి ఆర్టీసీ చరిత్రలో మరపురాని రోజుగా మిగిలింది. సొంత ఊర్లకు వెళ్ళేవారు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించడంతో, ఆదాయం విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. సంక్రాంతి నేపథ్యంలో గత సోమవారం ఒక్కరోజే రూ. 32 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఒక రోజు ఆదాయం ఇంత పెద్దమొత్తంలో రావడం ఇదే ప్రథమం. గతంలో ఒక రోజు అత్యధిక ఆదాయం రూ. 29 కోట్లుగా ఉంది. ప్రైవేటు బస్సుల అక్రమ రవాణాపై ట్రాన్స్ పోర్టు అధికారులు కఠినంగా వ్యవహరించడంతోనే ఆర్టీసీ ఆదాయం పెరిగిందని తెలుస్తోంది.