: ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఇప్పటిదాకా ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచంద్రరావు సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో, ఏపీకి ప్రత్యేకంగా ఎండీని నియమించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను కట్టబెట్టారు.