: సౌదీ రాజు అబ్దుల్లా మృతి... న్యూమోనియా కారణంగా మరణించిన చమురు రంగ దిగ్గజం
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ (91) మరణించారు. ప్రపంచంలోనే చమురు ఎగుమతి చేసే వ్యక్తుల్లో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన అబ్దుల్లా న్యూమోనియా కారణంగా మరణించారు. అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు సల్మాన్, సౌదీకి నూతన రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూమోనియాతో బాధపతుడుతున్న అబ్దుల్లా, నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒంటి గంటకు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 1923లో జన్మించిన అబ్దుల్లా, 2006 నుంచి సౌదీ అరేబియా రాజుగా కొనసాగుతున్నారు.