: ప్రశాంతంగా ఉన్న గుంటూరులో బాంబుల సంస్కృతి పెరిగింది: అంబటి


ఎంతో ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లాలో బాంబుల సంస్కృతి పెరిగిందని వైకాపా నేత అంబటి రాంబాబు ఆందోళన వెలిబుచ్చారు. గతంలో మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు కూడా బాంబులు వేయించిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక బాంబు దాడులు మరింత పెరిగాయని ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని పాపాయపాలెంలో టీడీపీ వారు చేసిన బాంబు దాడుల్లో వైకాపాకు చెందిన మాజీ జడ్పీటీసీ అచ్చిరెడ్డి, రఫీ గాయపడ్డారని చెప్పారు. తమ పార్టీ నేతలపై జరిగిన దాడిపై పోలీసులు వెంటనే స్పందించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News