: రాజకీయాలు మురికికూపమన్న అన్నా హజారే


రాజకీయరంగంపై తనకున్న వ్యతిరేక భావాన్ని మరోసారి బయటపెట్టారు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నా హజారే. రాజకీయాలు మురికికూపమన్న ఆయన... తాను ఆ మురికికి దూరంగా ఉంటానన్నారు. తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 'జన్ లోక్ పాల్' కోసం మళ్లీ ఉద్యమిస్తానని చెప్పారు. బీజేపీలో కిరణ్ బేడి చేరికపై ప్రశ్నించగా... దానిపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. కిరణ్ బేడీ ఫోన్ చేసినా స్పందించలేదన్న దానిపై మాట్లాడుతూ, రాజకీయ మురికికి దూరంగా ఉండాలనుకుంటున్నానని... ఆ మురికిలో ఉండలేనని చెప్పారు.

  • Loading...

More Telugu News