: కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీకి చిరంజీవి డుమ్మా


హైదరాబాదు ఇందిరా భవన్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గైర్హాజరయ్యారు. మరో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి కూడా హాజరు కాలేదు. పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో, ఈ కీలక సమావేశానికి చిరంజీవి డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది. కాగా, ఈ భేటీలో తిరుపతి ఉప ఎన్నిక, చంద్రబాబు పాలన, తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News