: జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు... జాతీయ రహదారి మూసివేత


జమ్మూ, కాశ్మీర్ వ్యాలీలో మంచు భారీగా కురుస్తోంది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. అటు 300 కిలోమీటర్ల రహదారిని మూసివేయడంతో పలుచోట్ల వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాశ్మీర్ వ్యాలీలతో పాటు గుల్ మార్గ్ లో 1.5 అడుగుల మంచు రాత్రి వరకు పడుతుందని మెట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లోనూ అత్యంత గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు.

  • Loading...

More Telugu News