: కేసీఆర్ ను కలవడానికి వచ్చి నిరాశతో వెనుదిరిగిన సుజనా
కేంద్ర మంత్రి సుజనా చౌదరి అసంతృప్తికి లోనయ్యారు. ఆయన నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అయితే, ఆ సమయంలో కేసీఆర్ సచివాలయంలో లేరు. అనారోగ్యం కారణంగా ఆయన సచివాలయానికి రాలేదు. దీంతో, సుజనా నిరాశగా వెనుదిరిగారు. కేసీఆర్ రాని విషయాన్ని అధికారులు ముందే చెప్పనందుకు కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారట. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో మాట్లాడిన అనంతరం సుజనా సచివాలయం నుంచి వెళ్లిపోయారు.