: మోదీపై ఎఫ్ బీలో తప్పుడు సమాచారం పోస్టు చేయడంపై కేసు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఫేస్ బుక్ లో తప్పుడు సమాచారం పోస్టు చేసిన వ్యక్తిపై మిజోరాం బీజేపీ యూనిట్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఏ), ఐపీఎస్ లోని సెక్షన్ 500 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు అధికారి ఐజ్వాల్ తెలిపారు. ఆరోపణలు చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. సదరు వ్యక్తి మోదీపై ఆధారాలులేని, తప్పుడు సమాచారాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ప్రచారం చేస్తున్నాడని మిజోరాం ప్రదేశ్ జనరల్ సెక్రెటరీ తెలిపారు.