: బీజేపీ ఆఫర్ చేసింది... కానీ నేను చేరడం లేదు: గంగూలీ


అనుకున్నట్టుగానే జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరస్కరించారు. ఈ మాజీ క్రికెటర్ బీజేపీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలపై మీడియా గంగూలీని ప్రశ్నించగా, "అవును, పార్టీలో చేరేందుకు బీజేపీ నాకు ఆవకాశం ఇచ్చింది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. ఎన్నికల్లో నేనస్సలు పోటీచేయను" అని దాదా స్పష్టం చేశాడు. కాగా, గతేడాది కూడా బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను గంగూలీ సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అటు బీజేపీ కూడా ఖండించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News