: రెండు ఉగ్రవాద సంస్థలపై పాక్ నిషేధం


ఉగ్రవాద సంస్థలపై ఉదాసీనంగా వ్యవహరించిన పాకిస్థాన్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల పర్యటనకు భారత్ రానున్న నేపథ్యంలో రెండు ఉగ్రవాద సంస్థలపై యుద్ధప్రాతిపదికన నిషేధం విధించింది. 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాతే ఉద్ దవా తో పాటు ఇంతవరకు భారత్ లో పెద్దగా ప్రస్తావన లేని ఉగ్రవాద సంస్థ హఖానీ నెట్ వర్క్ లను పాక్ నిషేధించింది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పుడు అమలు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, పాక్ తాజా నిర్ణయంపై పలువురు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ పాఠశాలపై అమానుషం జరిగినప్పుడే పాక్ ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణాలు ఆరాతీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News