: ఇరోం షర్మిలపై కేసును తిరస్కరించిన కోర్టు
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలపై నమోదైన ఆత్మహత్యాయత్నం కేసును కోర్టు కొట్టి వేసింది. ఆహారం తీసుకోకుండా ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమెపై కేసు నమోదైంది. కేసును ఈ రోజు విచారించిన ఇంఫాల్ కోర్టు, దాన్ని కొట్టి వేసింది. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న చట్టాన్ని తొలగించాలంటూ 15 సంవత్సరాల క్రితం ఇరోం షర్మిల నిరాహార దీక్షకు దిగారు. ఇప్పటికీ ఆమె తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, ఆమెకు బలవంతంగా ద్రవాలను శరీరంలోకి పంపుతున్నారు. ఈ క్రమంలో, ఆహారాన్ని తీసుకోకుండా ఆమె ఆత్యహత్యకు పాల్పడుతున్నారంటూ కేసు నమోదైంది.